Monday, December 23, 2024

నక్సల్స్ దాడిలో జవాన్ వీర మరణం

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ రెచ్చిపోతున్నారు. నారాయణ్‌పూర్ అమ్‌దై మైన్స్‌లో నక్సల్స్ అమర్చిన ఐఈడీ పేలి ఓ జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. మరో సైనికుడు గాయపడ్డాడు. గనుల్లోని పలుచోట్ల ఐఈడీలను అమర్చుతామని నక్సల్స్ హెచ్చరించారు. గతంలో ఐఈడీ పేలుడులో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.నక్సల్స్ ఐఈడీ దాడిలో సైనికుడిని కమలేష్ సాహుగా గుర్తించారు.

ఆయన స్వస్థలం జంజ్‌గిర్ చంపా జిల్లా హసౌద్ గ్రామం. నారాయణ్‌పూర్ లోని ఛోటెడోంగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్‌డై గనిలో ఉదయం నక్సలైట్లు ఐఈడీని పేల్చడంతో పాటు కాల్పులు జరిపారని బస్తర్ ఐజీ సురందర్ రాజ్ తెలిపారు. నక్సల్స్ దాడిలో సీఎఎఫ్ 9 వ కార్ప్‌కు చెందిన కానిస్టేబుల్ కమలేష్ కుమార్ వీర మరణం పొందారని తెలిపారు. కానిస్టేబుల్ వినయ్ కుమార్‌కు స్వల్ప గాయాలయ్యాయని చెప్పారు.

ఈ సంఘటన తరువాత పరిసర ప్రాంతాల్లోపోలీస్ బలగాలు , డీఆర్‌జీ, ఐటీబీపీ బలగాలు తనిఖీలు నిర్వహించాయి. ఇదిలా ఉండగా ఈనెల 9 న ఛోటాదొంగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఆలయంలో పూజలు చేసేందుకు వెళ్లిన బీజేపీ నేత కోమల్ మాఝీని నక్సల్స్ చంపేశారు.మరోవైపు నారాయణ్‌పూర్ గనుల వద్ద మోహరించిన 16 వాహనాలను నక్సల్స్ దగ్ధం చేశారు. పలువురు ఉద్యోగులను బందీలుగా పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News