Tuesday, November 5, 2024

భద్రతా దళాలకు తప్పిన పెను ప్రమాదం

- Advertisement -
- Advertisement -

రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలలో నిర్మాణంలో ఉన్న ఒక రోడ్డు వెంబడి నక్సలైట్లు అమర్చిన 21 ఇంప్రువైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైసెస్(ఐఇడిలు)ను శనివారం భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. పల్నర్, సావ్నర్ గ్రామాల మధ్య నిర్మాణంలో ఉన్న రోడ్డు వెంబడి ఒత్తిడికి విస్ఫోటం చెందే ఐఐఇడిలను నక్సలైట్లు అమర్చారని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. రాష్ట్ర పోలీసు విభాగాలైన జిల్లా రిజర్వ్ గార్డు, బస్తర్ ఫైటర్స్‌కు చెందిన సంయుక్త బృందం, సెంట్రల్ రిజర్వ్ పోలీసుకు చెందిన 85వ బెటాలియన్, 22వ బెటాలియన్, వీటితో పాటు బాంబు నిర్వీర్య బృందాలు, ఎలైట్ కోబ్రాకు చెందిన 202 బెటాలియన్, జిల్లా పోలీసులు సంయుక్తంగా కొత్తగా ఏర్పడిన పల్నర్ క్యాంపు నుంచి నక్సలైట్లు అమర్చిన మందుపాతరల కోసం గాలింపు ప్రారంభించాయని ఆ అధికారి తెలిపారు. ఈ గాలింపులో కొత్గా నిర్మిస్తున్న రోడ్డు వెంబడి వివిధ ప్రదేశాలలో అమర్చిన 21 ప్రెషర్ ఐఇడిలను స్వాధీనం చేసుకున్నారని, దీంతో ఒక భారీ ప్రమాదం తప్పిందని ఆయన అన్నారు.

ఒక్కో ఐఇడి 3 నుంచి 5 కిలోలు ఉందని, చెట్ల సమీపంలో భూమి కింద వీటిని నక్సల్స్ ఉంచారని ఆయన చెప్పారు. గస్తీలో ఉన్న భద్రతా సిబ్బందికి హాని చేసేందుకే వీటిని అమర్చారని ఆయన అన్నారు. కాగా..అదే జిల్లాలో జరిగిన మరో ఘటనలో గంగలూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని పెద్ద కర్మో గ్రామ సమీపంలోని అడవిలో మావోయిస్టులతో కాల్పుల పోరు అనంతరం వారి తాత్కాలిక శిబిరంపై భద్రతా సిబ్బంది దాడి చేసి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. గంగలూర్ ఏరియా కిమిటీకి చెందిన మావోయిస్టులు సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో భద్రతా దళాలు ఆ ప్రాంతానికి చేరుకుని కాల్పులు ప్రారంభించాయి. ఇరుపక్షాల మధ్య కాల్పుల పోరు సాగిందని, అవతలి వైపు నుంచి కాల్పులు ఆగడంతో శిబిరాన్ని చేరుకున్న భద్రతా దళాలకు కొన్ని ఆయుధాలు, మందులు, మవోయిస్టు సాహిత్యం, యూనిఫారాలు, రోజువారీ ఉపయోగించే వస్తువులు లభించాయని అధికారి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News