Thursday, January 23, 2025

లక్ష రివార్డు ఉన్న నక్సల్ కమాండర్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

సుక్మా : లక్ష రివార్డు ఉన్న నక్సల్ కమాండర్ ను ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలు సుక్మా జిల్లాలో అరెస్ట్ చేశాయి. అతని వద్ద నుంచి టిఫిన్ బాంబు, నాలుగు డిటొనేటర్లు, నాలుగు జెలటిన్ రాడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్ పోలీస్‌లు, కోబ్రా, సీఆర్‌పీఎఫ్ దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. అరెస్ట్ అయిన నక్సలైట్ సోది దివా అలియాస్ సునీల్‌గా గుర్తించారు. సుర్పన్‌గుడ ఆర్పీసీ ప్రాంతంలో ప్లాటూన్ కమాండర్‌గా దివా పనిచేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఐఈడీ పేలుళ్లు, హత్యలు, భద్రతాదళాలపై దాడులు, ఎన్‌కౌంటర్లు, తదితర కేసుల్లో ఇతని పాత్ర ఉన్నట్టు పోలీస్ అధికారులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News