Saturday, February 22, 2025

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో నక్సల్ కమాండర్ మృతి

- Advertisement -
- Advertisement -

Naxal commander killed in Chhattisgarh encounter

రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం ఉదయం భద్రతా దళాల ఎదురుకాల్పులలో ఒక నక్సల్ కమాండర్ మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో జిల్లా రిజర్వ్ గార్డు(డిఆర్‌జి)కి చెందిన ఒక జవాను కూడా గాయపడినట్లు ఐజి(బస్తర్ రేంజ్) సుందర్‌రాజ్ విలేకరులకు తెలిపారు. నైమెడ్ పోలీసు స్టేషన్ పరిధిలోని కైక, మోస్ల గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ కాల్పుల పోరు చోటుచేసుకున్నట్లు ఆయన చెప్పారు. మరణించిన నక్సల్ కమాండర్‌ను రితేష్ పునెమ్‌గా గుర్తించినట్లు ఆయన తెలిపారు. అతనిపై రూ. 3లక్షల రివార్డు ఉందని ఆయన చెప్పారు. మృతుడి నుంచి 12 బోర్ రైఫిల్, మావోయిస్టుకు సంబంధించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. గాయపడిన డిఆర్‌జి జవాను ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News