Wednesday, January 22, 2025

ఒడిశా ఎన్‌కౌంటర్‌లో నక్సల్ మృతి

- Advertisement -
- Advertisement -

రంధమాల్ జిల్లాలోని బుడనై రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో శుక్రవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో ఒక మావోయిస్టు మరణించినట్లు పోలీసులు తెలిపారు. నిఘా వర్గాల సమాచారాన్ని పురస్కరించుకుని బుడమై అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు అక్టోబర్ 23న గాలింపు చర్యలు చేపట్టాయని వారు చెప్పారు. శుక్రవారం 9 గంటల ప్రాంతంలో నక్సల్స్‌కు భద్రతా దళాలకు మధ్య కాల్పుల పోరు జరిగినట్లు వారు వివరించారు. కాల్పుల అనంతరం భద్రతా గాలింపు జరపగా ఒక మావోయిస్టు మృతదేహంతోపాటు ఒక ఎకె 47 తుపాకీ లభించాయని పోలీసులు తెలిపారు. మృతుడు సిపిఐ(మావోయిస్టు)కు చెందిన కంధమాల్-కలహండి–బౌధ్–నవగఢ్ డివిజన్‌లో పనిచేసే సీనియర్ ర్యాంకు నాయకుడిగా పోలీసులు భావిస్తున్నారు. ఒడిశాలో ఈ ఏడాదిలో మొత్తం ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News