Wednesday, April 9, 2025

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మహిళా నక్సల్ మృతి

- Advertisement -
- Advertisement -

రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో గురువారం భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులలో ఒక మహిళా నక్సలైట్ మరణించినట్లు పోలీసులు తెలిపారు. కిరండల్ పోలీసు స్టేషన్ పరిధిలోని పురంగెల్, ఇరయ్‌గూడెం మధ్య అడవులలో నక్సలైట్ల కోసం గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా సిబ్బందికి, నక్సలైట్లకు మధ్య కాల్పుల పోరు సాగినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కాల్పుల పోరు అనంతరం ఒక మహిళా నక్సలైట్ మృతదేహం అక్కడ లభించినట్లు ఆయన చెప్పారు. ఆ ప్రదేశంలో ఒక తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News