Monday, April 28, 2025

నక్సలిజం శాంతిభద్రతల సమస్యకాదు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: నక్సలిజాన్ని తమ ప్రభుత్వం సామాజిక కోణంలో మాత్రమే చూస్తుందని, దానిని శాంతిభద్రతల అంశంగా పరిగణించడంలేదని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆదివారం శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గాప్రసాద్, జంపన్న, రవి చందర్ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలుసుకుని వినతిపత్రం అందజేసి ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మా వోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపే విధంగా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశా రు. కాల్పుల విరమణకు కేంద్రప్రభుత్వాన్ని ఒ ప్పించాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. గతం లో నక్సలైట్లతో శాంతిచర్చలు జరిపిన అనుభవం సీనియర్ నేత, మాజీ హోమ్ మంత్రి కె.జానారెడ్డికి ఉందని, ఈ అంశంపై సీనియర్ నేత జానారెడ్డి సలహాలు , సూచనలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వారికి వివరించారు. మీ విజ్ఞప్తిని మంత్రులతో చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటామని హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News