Wednesday, January 22, 2025

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. నక్సల్ మృతి

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో ఆదివారం భద్రతా దళాలకు, నక్సల్స్‌కు మధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో నక్సల్ ఒకరు మృతి చెందాడు. భేజి పోలీస్ స్టేషన్ పరిధిలో నగరం, పంటభేజి గ్రామాల మధ్యనున్న అడవుల్లో ఈ కాల్పులు జరిగాయి. కొంటా ఏరియా మావోయిస్ట్ కమిటీ సభ్యుడు సోధి గజేంద్ర , మరికొందరు అక్కడి అడవుల్లో ఉన్నారన్న సమాచారంపై భద్రతా సిబ్బంది నక్సల్ గాలింపు చర్యలు చేపట్టిందని పోలీస్ అధికారులు తెలిపారు. ఎన్‌కౌంటర్ ముగిశాక నక్సల్ మృతదేహాన్ని, 12 బోర్ రైఫిల్‌ను, పిస్తోలు, మావోయిస్టు సంబంధ సాహిత్యం,

ఇతర వస్తువులు సంఘటన ప్రదేశం నుంచి పోలీస్‌లు స్వాధీనం చేసుకున్నారు. మృతిచెందిన నక్సలైట్‌ను ఇంకా గుర్తించ వలసి ఉందని పోలీస్‌లు చెప్పారు. మంగళవారం సిఆర్‌పిఎఫ్ సిబ్బంది ముగ్గురు టెక్లగూడెం వద్ద ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో కనీసం 15 నుంచి 20 మందైనా నక్సల్స్ చనిపోయి ఉంటారని, కానీ సహచర నక్సల్స్ వారిని అడవి లోకి తీసుకెళ్లిపోయారని పోలీస్‌లు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News