Monday, December 23, 2024

బీజపూర్ ఎన్‌కౌంటర్‌లో నక్సల్ మృతి

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్ లోని బీజపూర్ జిల్లాలో ఆదివారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక నక్సలైట్ మృతి చెందాడు. బీజపూర్ జిల్లా రిజర్వుగార్డ్ (డిఆర్‌జి) బృందం నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్‌లో గాలిస్తుండగా, ఆదివారం తెల్లవారు జామున 5.30 గంటల ప్రాంతంలో బైరామ్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేష్‌కుతుల్ గ్రామం సమీపంలో ఎదురెదురు కాల్పులు జరిగాయి. రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కు 400కిమీ దూరంలో కేష్‌ముండి అడవుల్లో మావోయిస్టుల డివిజన్ సప్లై టీమ్ కమాండర్ కవాసి పండారు,

మరో 20 మంది ఉన్నారని సమాచారం అందగా, ఈ ఆపరేషన్ చేపట్టినట్టు సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు. కాల్పులు ముగిసిన తరువాత సంఘటన స్థలం నుంచి నక్సల్ మృతదేహం, ఆయుధం, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఆ ప్రాంతంలో ఇంకా గాలింపు కొనసాగుతోందని తెలిపారు. బస్తర్ ప్రాంతంలోవేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఇప్పటివరకు 80 మంది నక్సలైట్లు మృతి చెందారు. ఏప్రిల్ 16న ఈ ప్రాంతం లోని కంకేర్ జిల్లాలో భద్రతాదళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 29 మంది నక్సల్స్ మరణించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News