Wednesday, January 22, 2025

రూ.8 లక్షల రివార్డున్న నక్సల్ ఎన్‌కౌంటర్‌లో హతం

- Advertisement -
- Advertisement -

దంతేవాడ : గత మూడు దశాబ్దాలుగా మావోయిస్ట్ కార్యకలాపాల్లో కీలక పాత్ర వహిస్తున్న నక్సలైట్ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఆయన తలపై రూ. 8 లక్షల రివార్డు ఉంది. చత్తీస్‌గఢ్ లోని దంతేవాడ సుకుమా జిల్లాల సరిహద్దుల్లో బుధవారం ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. జిల్లాల సరిహద్దులో నక్సల్స్ ఉన్నారన్న సమాచారంపై భద్రతాదళాలు ఏరివేత ప్రారంభించారని దంతేవాడ ఎస్‌పి గౌరవ్ రాయ్ విలేఖరులకు చెప్పారు.

ఎదురెదురు కాల్పులు ముగిసిన తరువాత నక్సల్ చంద్రన్న అలియాస్ సత్యం మృతదేహాన్ని గుర్తించడమైందని తెలిపారు. మృతదేహం వద్ద నాటు పిస్తోలు, నాలుగు తూటాలు, మావోయిస్టు సంబంధ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. 50 ఏళ్ల చంద్రన్న సుకుమా జిల్లా గోలపల్లి నివాసి. నిషేధిత నక్సల్ కార్యకలాపాల్లో గత 30 ఏళ్లుగా చురుకుగా పాల్గొంటున్నాడు. నక్సల్ హింసాత్మక సంఘటనల్లో చంద్రన్నకు ప్రమేయం ఉందని ఎస్‌పి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News