Sunday, January 19, 2025

ఎన్‌కౌంటర్ వేళ గ్రామస్థులతో కలిసిపోయిన నక్సల్స్

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్ లో బీజపూర్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12 మంది నక్సల్స్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో వారు తమ నక్సల్ యూనిఫారం విడిచిపెట్టి సాధారణ గ్రామస్థులుగా కనిపించారని బీజపూర్ ఎస్‌పి జితేంద్రకుమార్ యాదవ్ విలేఖరులకు శనివారం వెల్లడించారు. మృతి చెందిన నక్సల్స్‌ను గుర్తించామని వారి తలలపై మొత్తం రూ. 31 లక్షల రివార్డు ఉందని పేర్కొన్నారు. మిలీషియరీ కంపెనీ సభ్యులైన బుధు ఒయాం, కల్లుపునెమ్ ఒక్కొక్కరిపై రూ. 8 లక్షల వంతున రివార్డు ఉందని చెప్పారు.

గంగలూరు ఏరియా కమిటీ సభ్యుడు లఖే కుంజం,మిలిటరీ ప్లాటూన్ నెం. 12 భీమా కరం వీరిద్దరిపై రూ. 5 లక్షల వంతున రివార్డు ఉందన్నారు. ఇక మిగతా మిలీషియా ప్లాటూన్ కమాండర్ సన్ను లకోం, జనతా సర్కార్ ఉపాధ్యక్షుడు అవ్లామ్ వీరిద్దరిపై రూ. 2 లక్షల వంతున రివార్డు ఉందన్నారు. మిగతా ఆరుగురు తక్కువ స్థాయి సభ్యులని ఎస్‌పి చెప్పారు. స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు చైతు, లెంగు, పాపారావు, మావోయిస్టులు వెల్ల , కాగలూర్ ఏరియా కమిటీ సెక్రటరీ దినేష్ మోడియం, 150 మంది క్యాడర్లు అడవిలో ఉన్నారన్న సమాచారంతో ఆపరేషన్ నిర్వహించామని ఎస్‌పి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News