Sunday, January 19, 2025

ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్ల విధ్వంస కాండ

- Advertisement -
- Advertisement -

నారాయణ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ నారాయణ్‌పూర్ జిల్లాలో రోడ్డు నిర్మాణం పనిలో ఉన్న ఒక మిక్సింగ్ మెషీన్‌ను, వాటర్ ట్యాంకర్‌తో ఉన్న ట్రాక్టర్‌ను నక్సలైట్లు దగ్ధం చేసినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. కురుష్ణర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఝరావాహి, జీవ్లపదర్ గ్రామాల మధ్య గురువారం సాయంత్రం జరిగిన ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారి ఒకరు తెలియజేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం,ఛత్తీస్‌గఢ రాజధానికి 300 కిలో మీటర్లకు పైగా దూరంలో ఉన్న రోడ్డు నిర్మాణ ప్రదేశానికి సాయుధ నక్సలైట్లు కొందరు దూసుకువచ్చి,

అక్కడ పనిని నిలిపివేయవలసిందిగా కార్మికులను బెదరించినట్లు ఆయన తెలిపారు. అటుపిమ్మట నక్సలైట్లు మిక్సర్ మెషీన్‌ను, వాటర్ ట్యాంకర్‌తో కూడిన ట్రాక్టర్‌ను దగ్ధం చేశారని ఆయన తెలిపారు. ఆ దహనకాండ గురించి సమాచారం అందిన మీదట ఒక పోలీస్ బృందాన్ని శుక్రవారం ఉదయం ఆ ప్రదేశానికి పంపారని, నక్సలైట్ల ఆచూకీ తీయడానికి అన్వేషణ కార్యక్రమం మొదలైందని ఆ అధికారి తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News