- Advertisement -
గయ: పోలీస్ ఇన్‌ఫార్మర్లన్న ఆరోపణలతో బీహార్‌లోని గయా జిల్లాలో ఓ కుటుంబానికి చెందిన నలుగురిని మావోయిస్టులు కొట్టి చంపారు. వారిలో ఇద్దరు మహిళలున్నారు. శనివారం రాత్రి దుమారియా పోలీస్‌స్టేషన్ పరిధిలోని మారుమూల గ్రామంలో ఈ ఘటన జరిగింది. బీహార్,జార్ఖండ్ సరిహద్దున ఉన్న ఆ గ్రామంలోకి ప్రవేశించిన నక్సలైట్లు సరయూసింగ్‌భోక్తా ఇంటిని బాంబులతో పేల్చివేశారు. ఆయన ఇద్దరు భార్యలు, ఇద్దరు కుమారుల్ని హత్యగావించి పశువుల కొట్టంలో వ్రేలాడదీశారు. ఆ సమయంలో సరయూసింగ్ ఇంట్లో లేరు. సరయూసింగ్ కుటుంబసభ్యులు పోలీసులకు ఇన్‌ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారని సంఘటనా స్థలంలో వదిలిన కరపత్రాల్లో మావోయిస్టులు ఆరోపించారు.
- Advertisement -