Saturday, February 22, 2025

దంతేవాడలో ఇద్దరిని చంపేసిన నక్సలైట్లు

- Advertisement -
- Advertisement -

దంతేవాడ జిల్లాలో ఇద్దరు వ్యక్తులను పోలీసుల ఇన్ఫార్మర్లు అన్న అనుమానంతో నక్సలైట్లు చంపేశారు. ఈ విషయాన్ని పోలీసులు గురువారం వెల్లడించారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బర్సూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోడ్మ గ్రామంలో బామన్ కశ్యప్(29), రామ్ పోయమ్(38)లను బుధవారం సాయంత్రం చంపేశారని పోలీసు అధికారి తెలిపారు. ఈ విషయం తెలియగానే దంతేవాడ బీజాపూర్ అటవీ ప్రాంతంలోని గ్రామాలకు వెంటనే భద్రతా బలగాల బృందాలను పంపించారు. చనిపోయిన వారిలో ఒకరైన కశ్యప్ ‘శిక్షా దూత్’(తాత్కాలిక విజిటింగ్ టీచర్)గా పనిచేస్తున్నాడు. అతడు చనిపోయిన ప్రదేశంలో దొరికిన కరపత్రంలో అతడు పోలీస్ ఇన్‌ఫార్మర్ అని నక్సలైట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News