Wednesday, January 29, 2025

బీజాపూర్‌లో గ్రామస్థుడిని చంపేసిన నక్సలైట్లు

- Advertisement -
- Advertisement -

బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో నక్సలైట్లు ఓ 41 సంవత్సరాల వ్యక్తిని చంపేశారు. అతడు నక్సలైట్ల ఉద్యమ సమాచారం లీక్ చేస్తున్నాడన్న కారణంగా చంపేశారని పోలీసులు సోమవారం తెలిపారు. అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం భైరామ్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశముండి గ్రామం నివాసి భద్రు సోదిపై గుర్తు తెలియని నక్సలైట్లు దాడి చేశారు. అతడిని ఆదివారం సాయంత్రం అతడి ఇంటి వద్దే గొడ్డలితో నరికి చంపారు. ఈ విషయం తెలియగానే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సోమవారం అతడి భౌతిక కాయాన్ని పోస్ట్‌మార్టంకు పంపారని ఓ పోలీస్ అధికారి తెలిపారు. ఘటనాస్థలి వద్ద భైరాంగఢ్ మావోయిస్టు కమిటీ వదిలి వెళ్లిన కరపత్రం దొరికింది. అందులో హతుడిని ద్రోహిగా నక్సలైట్లు పేర్కొన్నారు. ఇంకా ఆ కరపత్రంలో మావోయిస్టు వ్యతిరేక సివిల్ మిలిషియా సల్వా జుడుం ఉద్యమంలో సోధి క్రియాశీలి అని పేర్కొన్నారు.

సల్వా జుడుం 2011లో విడిపోయింది. అప్పటి నుంచి సిపిఐ(మావోయిస్టు) సమాచారాన్ని అది లీక్ చేస్తోందని పోలీస్ అధికారి తెలిపారు. గ్రామస్థుడిని చంపిన హంతకులను ట్రేస్ చేయడానికి ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల కాలంలో భద్రతా బలగాలు దాడులు ఉధృతం చేసేసరికి నక్సలైట్లు తమ పట్టున్న బలమైన ప్రాంతాలను కోల్పోయారు. నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ ఊపందుకోవడంతో వారంతా పలాయనం చిత్తగించారు. పైగా భద్రతా బలగాల కొత్త క్యాంపులు వెలుస్తుండడంతో వారికి దిక్కుతోచడంలేదు. అసహనానికి లోనవుతున్న నక్సలైట్లు అమాయక గిరిజనులను లక్షంగా చేసుకుంటున్నారని, వారిని ద్రోహులుగా చిత్రీకరించి చంపేస్తున్నారని ఆ పోలీసు అధికారి వివరించారు. జనవరి 16న బీజాపూర్‌కు చెందిన మిర్తూరు ప్రాంతంలో 48 ఏళ్ల వ్యక్తిని పోలీస్ ఇన్ఫార్మర్ అనే అనుమానంతో నక్సల్స్ చంపేశారు. బీజాపూర్ సహా ఏడు జిల్లాలు ఉన్న బస్తర్ ప్రాంతంలో గత ఏడాది 68 మంది పౌరులను నక్సల్స్ వేర్వేరు ఘటనలలో చంపేశారని పోలీసుల కథనం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News