Thursday, December 19, 2024

నాలుగు ట్రక్కులకు నిప్పు పెట్టిన నక్సల్స్

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్ లోని నారాయణ్‌పూర్ జిల్లాలో గని నుంచి ఇనుపరాయిని తీసుకెళ్లే నాలుగు ట్రక్కులకు నక్సల్స్ నిప్పుపెట్టారు. శనివారం రాత్రి ఈ సంఘటన జరిగిందని ఎవరూ గాయపడలేదని పోలీస్‌లు వెల్లడించారు. ప్రైవేట్ సంస్థకు కేటాయించిన అందాయి ఘాటి గని నుంచి ఇనుప రాయిని ఈ ట్రక్కులు తీసుకు వెళ్తున్నాయి. నక్సల్స్ ఆ ట్రక్కులను అడ్డుకుని డ్రైవర్లను కిందకు దిగమన్నారు. తరువాత ట్రక్కులకు నిప్పు పెట్టి అక్కడ నుంచి పరారయ్యారు. ఈ సంఘటన తెలిసిన వెంటనే పోలీస్‌లు అక్కడకు వెళ్లేసరికే ట్రక్కులు పూర్తిగా దగ్ధమయ్యాయి. అందాయి ఘాట్ గని తవ్వకాన్ని నక్సల్స్ గత కొన్నాళ్లుగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో ఇదే విధంగా గని ప్రాంతంలో వాహనాలను కాల్చి వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News