గిరిఢీ: జార్ఖండ్‌లోని గిరిఢీ జిల్లాలో గురువారం తెల్లవారుజామున రైల్వే ట్రాకును మావోయిస్టులు పేల్చివేశారు. పేలుడు కారణంగా హౌరా-న్యూఢిలీ మార్గంలో దాదాపు ఆరు గంటల పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడినుట్ల ధన్‌బాద్ ఆర్‌పిఎఫ్ సీనియర్ కమాండెంట్ హేమంత్ కుమార్ తెలిపారు. మావోయిస్టులు అమర్చిన బాంబులు పేలి చిచకి, చౌదరీబంధ్ స్టేషన్ల మధ్య రైల్వే ట్రాకు ధ్వంసమైందని ఆయన చెప్పారు. అర్ధరాత్రి 12.30 గంటలకు రెండు స్టేషన్ల మధ్య రైలు సర్వీసులను నిలిపివేసి దుయం 6.30 గంటలకు ట్రాకును పునరుద్ధరించినట్లు ఆయన వివరించారు. రైల్వే ట్రాకుకు చెందిన ప్యానెల్ క్లిప్ దెబ్బతిందని, అనేక రైళ్లను మరల్చినట్లు ఆయన చెప్పారు. మావోయిస్టు అగ్రనాయకుడు ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్ దా అరెస్టుకు నిరసనగా మావోయిస్టు పార్టీ 24 గంటల జార్ఖండ్ బంద్‌కు పిలుపునిచ్చిన సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది.
జార్ఖండ్‌లో రైల్వే ట్రాకు పేల్చివేసిన నక్సల్స్
- Advertisement -
- Advertisement -
- Advertisement -