Sunday, December 22, 2024

ఇద్దరిని చెట్టుకు వేలాడించి ఉరి తీసిన నక్సల్స్

- Advertisement -
- Advertisement -

చత్తీస్‌గఢ్ బీజపూర్ జిల్లా జప్పెమర్క గ్రామంలో ఇద్దరిని చెట్టుకు వేలాడించి నక్సల్స్ ఉరితీసిన సంఘటన జరిగింది. వారిద్దరూ పోలీస్ ఇన్‌ఫార్మర్లు అని, అందుకనే ఈ హత్య చేశామని మావోయిస్ట్ భైరామ్‌గఢ్ ఏరియా కమిటీ ప్రకటించింది. మృతులు మద్విసుజ, పోడియం కోసాగా గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం నక్సల్స్ పోలీస్ ఇన్‌ఫార్మర్లు అన్న అనుమానంతో ముగ్గురు గ్రామస్థులను మంగళవారం నిర్బంధం లోకి తీసుకున్నారు.

ఆ ముగ్గురిలో స్కూలు విద్యార్థి ఒకరు ఉన్నారు. ఆ తరువాత జన అదాలత్ (కంగారూ కోర్టు) నిర్వహించి ఇద్దరిని చెట్టుకు వేలాడ దీసి ఉరితీశారని, విద్యార్థిని విడిచిపెట్టారని సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. ఈ సంఘటనతో పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు . సంఘటన ప్రదేశానికి తదుపరి వివరాల సోసం పోలీస్‌బృందాన్ని పంపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News