Friday, November 22, 2024

ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్న నక్సల్స్

- Advertisement -
- Advertisement -

Naxals plot to attack security forces in Gadchiroli

 

సంఘటన స్థలం నుంచి రైఫిల్, పేలుడు పదార్ధాల స్వాధీనం

గడ్చిరోలి : మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో భద్రతాదళాలపై దాడికి పన్నాగం పన్నిన నక్సల్స్ ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్నట్టు సంఘటన స్థలంలో రైఫిల్, పేలుడు పదార్థాలు స్వాధీనమైనట్టు పోలీస్ అధికారులు ఆదివారం వెల్లడించారు. నక్సల్ వారం సందర్భంగా అడవిలో నక్సల్స్ సమావేశం అవుతున్నట్టు సమాచారం అందగానే గడ్చిరోలి పోలీస్ సి60 కమాండోస్ శనివారం హెటల్‌కసా ఏరియాలో యాంటీనక్సల్ ఆపరేషన్ నిర్వహించారు. దాదాపు 70 మంది ఉగ్రవాదులు కమాండోస్‌పై కాల్పులకు తెగబడ్డారు. రెండువైపులా గంటపాటు కాల్పులు సాగాయి. నక్సల్స్ కొన్ని తమ వస్తువులను పేలుడు పదార్థాలను విడిచి పారిపోయారని గచ్చిరోలి ఎస్‌పి చెప్పారు. ఆ ఏరియాలో 303 రైఫిల్, మ్యాగజైన్, మూడు బాంబులు, నక్సల్ యూనిఫారాలు, రెండు సోలార్ ప్లేట్లు, వైరు బండిల్స్, నిత్యావసరాలు విడిచిపెట్టి పోయారని చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News