Friday, November 22, 2024

రాకేశ్వర్ సింగ్ తమ ఆధీనంలోనే ఉన్నాడు: లేఖలో మావోయిస్టుల డిమాండ్లు

- Advertisement -
- Advertisement -

బీజాపూర్: ఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టులు లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా మావోయిస్టులు ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు ఉంచారు. రెండు రోజుల క్రితం బీజాపూర్ లో జవాన్లకు మవోయిస్టుల మధ్య జరిగిన భీకర కాల్పుల్లో దాదాపు 24మంది జవాన్లు ప్రాణాలు కోల్పోగా, చాలామంది జవాన్లు గాయపడ్డారు. ఈ భీకర యుద్ధంలో మావోయిస్టులు కొంతమంది జవాన్లను హింసించి చంపినట్లు అధికారులు చెప్పారు. ఇక, కోబ్రా యూనిట్ కు చెందిన కమాండో రాకేశ్వర్ సింగ్ కనిపించకుండా పోయినట్లు అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో ప్రతీకారం తీర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భారీగా భద్రతా బలగాళ్లను రంగంలోకి దింపుతోంది. ఈ నేపథ్యంలో మావోయిస్టులు లేఖను విడుదల చేశారు.రాకేశ్వర్ సింగ్ తమ ఆధీనంలోనే ఉన్నాడని, ప్రహార్-3 పేరుతో నిర్వహిస్తున్న నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ ను తక్షణమే నిలిపివేయాలని మావోయిస్టులు లేఖలో డిమాండ్ చేశారు.అలాగే, ఏప్రిల్ 26న భారత్ బంద్ కు మావోయిస్టులు పిలుపు నిచ్చారు.

Naxals released a letter after encounter in Chhattisgarh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News