Friday, December 27, 2024

బీజపూర్‌లో రెండు బస్సులను తగులబెట్టిన నక్సల్స్

- Advertisement -
- Advertisement -

బీజపూర్ : ఛత్తీస్‌గఢ్ లోని బీజపూర్‌లో గురువారం రెండు బస్సులను నక్సల్స్ తగులబెట్టారు. ఈ రెండు బస్సులు జగదల్‌పూర్, బీజపూర్ మధ్య నడుస్తున్నాయి. ఈ సమాచారం తెలుసుకున్న భద్రతాదళాలు అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో తిమ్మాపూర్ వద్ద ఒక బస్సును ఆపి తగుల బెట్టగా, రెండవబస్సు రాయిపూర్ వెళ్తుండగా దుయిగిడ గ్రామం వద్ద తగుల బెట్టారని బీజపూర్ ఎస్‌పి ఆంజనేయ వర్షెనే చెప్పారు. నక్సల్స్ బాగా రద్దీగా ఉండే బీజపూర్ జగదల్‌పూర్ జాతీయ రహదారికి అడ్డంగా చెట్లను నరికి దిగ్బంధం చేశారని తెలిపారు. భద్రతా దళాలు తమ క్యాడర్ నక్సల్స్‌ను హతమార్చినందుకు నిరసనగా శుక్రవారం సిపిఎం చేపట్టిన బంద్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతూ ప్రచురించిన కరపత్రాలను నక్సల్స్ ఆ ప్రాంతంలో వెదజల్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News