Saturday, December 21, 2024

రోడ్డు నిర్మాణ యంత్రాలను దగ్ధం చేసిన నక్సల్స్

- Advertisement -
- Advertisement -

కంకేర్ : ఛత్తీస్‌గఢ్ కంకేర్ జిల్లాలో రోడ్డు నిర్మాణానికి ఉపయోగించే మూడు యంత్రాలను శనివారం సాయంత్రం నక్సల్స్ దగ్ధం చేశారు. అయితే ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు ఆదివారం తెలిపారు. కంటేడ, గట్టకల్ గ్రామాల మధ్య ఈ సంఘటన జరిగింది. ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన కార్యక్రమం కింద ఈ రోడ్డు నిర్మాణం జరుగుతోంది.

కొంతమంది మహిళా నక్సల్స్ గుంపుగా వచ్చి నిర్మాణ ప్రదేశాన్ని ధ్వంసం చేశారని, పని ఆపేయాలని కార్మికులను బెదిరించారని, వారి దగ్గర నుంచి మొబైల్ ఫోన్లు లాక్కున్నారని పోలీసులు తెలిపారు. తరువాత రెండు ఎర్త్‌మూవింగ్, మిక్చర్ మెషిన్లను దగ్ధం చేశారని ఎఎస్‌పి ధీరేంద్ర పటేల్ చెప్పారు. సమాచారం తెలియగానే పోలీస్ బృందాలు అక్కడకు వెళ్లి గాలింపు చేపట్టాయని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News