Thursday, January 23, 2025

ఛత్తీస్‌గఢ్‌లో కేబుల్ పనులను అడ్డుకున్న నక్సల్స్..

- Advertisement -
- Advertisement -

బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఒక ప్రైవేట్ టెలికాం కంపెనీకి చెందిన కేబుల్స్‌ను భూమిలో అమర్చడానికి ఉపయోగించే యంత్రాన్ని, రెండు వాహనాలను నక్సల్స్ దగ్ధం చేశారు. ఆదివారం రాత్రి పడేరా, కాకేకొర్మ గ్రామాల మధ్య జరిగిన ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదని సోమవారం పోలీసులు తెలిపారు. కేబుల్ వేసే పనులు జరుగుతున్న సమయంలో అక్కడకు చేరుకున్న సాయుధ నక్సల్స్ పని ఆపాలంటూ కార్మికులను బెదరించి అక్కడ మట్టిని తవ్వే యంత్రాన్ని, రెండు వాహనాలను తగలబెట్టారని బీజాపూర్ ఎఎస్‌పి పంకజ్ శుక్లా తెలిపారు. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదని ఆయన తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

Naxals stops Telecom Cable Works in Chhattisgarh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News