Thursday, December 19, 2024

హర్యానా ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ

- Advertisement -
- Advertisement -

చండీగఢ్: హర్యానా ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ అక్టోబర్ 15న పంచ్ కులాలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకార ఏర్పాట్లు పర్యవేక్షించడానికి పంచ్ కుల డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలో 10 మంది అధికారులున్న కమిటీని కూడా ఏర్పాటు చేశారు.

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి గెలిచింది. ఆ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీని ఎన్నుకోబోతున్నారు. సైనీతో పాటు కొంత మంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారని సైనీ సన్నితుడొకరు తెలిపారు. ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారని కూడా ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News