Sunday, December 22, 2024

హర్యానా ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణం

- Advertisement -
- Advertisement -

మనోహర్ లాల్ ఖట్టర్‌ను తప్పించిన బిజెపి
కురుక్షేత్ర ఎంపీగా పూర్తికానున్న సైనీ పదవీకాలం
ఈ ఏడాది చివరిలో హర్యానా అసెంబ్లీ ఎన్నికలు

చండీగఢ్: అనూహ్య పరిణామాల మధ్య హర్యానా నూతన ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ మంగళవారం పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఆయన మంత్రివర్గ సహచరులు తమ పదవులకు మంగళవారం ఉదయం రానీజామా చేయగా కొద్ది గంటలకే కొత్త ముఖ్యమంత్రిగా సైనీని బిజెపి అధిష్టాన వర్గం ఎంపిక చేసింది. ముఖ్యమంతిరగా సైనీతోపాటు ఐదుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రులుగా ప్రమాణం చేసినవారిలో బిజెపి నాయకులు కన్వర్ పాల్, మూల్ చంద్ శర్మ, జై ప్రకాశ్ దళాల్, బన్వరీలాల్, స్వతంత్ర ఎమ్మెల్యే రంజిత్ ఇసంగ్ చౌతాలా ఉన్నారు.

ఇక్కడి రాజ్‌భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్యమంత్రిగా సైనీతో ప్రయాణం చేయించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి ఖట్టర్‌కు ప్రణామం చేసిన సైనీ ఆయన ఆశీస్సులు కోరారు. అంతకుముందు&ఓబిసి నాయకుడైన సైనీని(54) హర్యానా నూతన ముఖ్యమంత్రిగా బిజెపి నాయకత్వం ప్రకటించింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సైనీ కురుక్షేత్ర నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. లోక్‌సభ ఎన్నికలు మరి కొద్ది రోజుల్లో జరగనున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యపరిచింది.

ఈ ఏడాది చరివరిలో హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రెండవసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న ఖట్టర్‌ను అనూహ్యంగా బిజెపి పక్కకు తొలగించింది. పారీ కేంద్ర పరిశీలకులు చండీగఢ్ చేరుకున్న తర్వాత ఖట్టర్, ఆయన మంత్రివర్గంలోని 13 మంది సభ్యులు సమిష్టిగా వెళ్లి గవర్నర్‌కు తమ రాజీనామా లేఖలు సమర్పించారు.

సైనీకి మోడీ శుభాకాంక్షలు
హర్యానా నూతన ముఖ్యమంత్రిగా మంగళవారం ప్రమాణం చేసిన నయాబ్ సింగ్ సైనీకి ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. హర్యానా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో సైనీ, ఆయన మంత్రివర్గం సఫలీకృతం కావాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News