Sunday, January 19, 2025

హర్యానా సిఎంగా నాయబ్‌ సింగ్ సైనీ ప్రమాణం

- Advertisement -
- Advertisement -

హర్యానాలో ముఖ్యమంత్రిగా నాయబ్‌సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం సైనీతో సీఎంగా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ప్రమాణం చేయించారు. గురువారం వేడుకగా జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఎపి సీఎం చంద్రబాబు, ఉత్తరప్రదేశ్‌ సిఎం యోగి ఆదిత్యనాథ్‌, మహారాష్ట్ర సిఎం ఏక్‌నాథ్‌ శిండే, గుజరాత్‌ సిఎం భూపేంద్ర పటేల్‌, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. కాగా, ఇటీవల జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 49 సీట్లు సాధించిన సంగతి తెలిసిందే. దీంతో మూడోసారి బిజెపి హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News