Wednesday, January 22, 2025

ఓబీసీ ఓట్లపై బిజెపి కన్ను.. ముఖ్యమంత్రి మార్పు వెనుక కారణాలు ఎన్నో

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు ముందు హర్యానాలో నాయకత్వం మార్పు ద్వారా బిజెపి ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్న సందేశాన్ని పంపించింది. హర్యానా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జననాయక్ జనతా పార్టీ (జెజెపి) నాయకుడు దుష్యంత్ చౌతాలాను పదవి నుంచి తప్పించడంలో బిజెపి తన పంతాన్ని నెగ్గించుకుంది. హర్యానాలో లోక్‌సభ సీట్ల పంపకంలో బిజెపి, జెజెపికి మధ్య విభేదాలు తలెత్తాయి.

రాష్ట్రంలోని మొత్తం 10 లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేయాలని బిజెపి భావిస్తోంది. అయితే 2019 ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయిన జెజెపి తమకు ఈసారి కనీసం 2 స్థానాలైనా కేటాయించాలని గట్టిగా పట్టుపట్టింది. జెజెపితో తెగతెంపులు చేసుకోవడం, దుష్యంత్ చౌతాలానుం మంత్రి మండలి నుంచి తప్పించడం వల్ల జాట్ల జనాభా అధికంగా ఉన్న హర్యానాలో తమ విజయావకాశాలపై ప్రభావం పడే ప్రమాదం ఉందని ముందే పసిగట్టిన బిజెపి అనేక జాగ్రత్తలు తీసుకుంది.

ఓబిసి నాయకుడైన సైనీని ఖట్టర్ స్థానంలో నియమించి జాట్లకు చెందని బలమైన వర్గాల మద్దతును కూడగట్టుకోవాలని నిర్ణయించింది. చౌదరి బీరేంద్ర సింగ్ కుమారుడు, హిసర్‌కు చెందిన బిజెపి ఎంపి బ్రిజేంద్ర చౌదరి గత వారం కాంగ్రెస్‌లో చేరడం కూడా ముఖ్యమంత్రి మార్పునకు కారణాలలో ఒకటని వర్గాలు తెలిపాయి. హర్యానా జనాభాలో 20 శాతం మంది జాట్లు ఉన్నారు. మిగిలిన 80 శాతం మందిలో ఇతర కులాలవారు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News