Sunday, December 22, 2024

ఆసక్తి రేకేత్తిస్తున్న ‘నాయకుడు’ ట్రైలర్

- Advertisement -
- Advertisement -

తమిళంలో తాజాగా సంచలనం సృష్టించిన మామన్నన్ తెలుగులో నాయకుడు గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహద్ ఫాసిల్,కీర్తి సురేష్ ప్రధాన పాత్రలు పోషించినఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ కి మరిసెల్వరాజ్  దర్శకత్వం వహించారు. మామన్నన్ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచి తెలుగు వెర్షన్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ‘నాయకుడు’ ట్రైలర్ ని లాంచ్ చేశారు.

”నేను పాడుతున్న పాట ఒకే పాట అయ్యిండాలి. ఆ పాట నేను జీవితాంతం  పాడుతూ వుండాలి. నా పొట్ట నుంచి పేగులు తీసి దానితో వీణ చేసి దాన్ని వీధి వీధిన మీటుతున్నాను. నిజాన్ని వినే చెవుల్ని నేను వెదుకుతున్నాను” అనే ఇంటెన్స్ వాయిస్ ఓవర్  తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం హార్డ్ హిటింగ్ గా సాగింది.

వడివేలు, ఉదయనిధి స్టాలిన్  కొండపై నిలబడి నగరాన్ని చూస్తుండగా, తుపాకీ పేల్చి ఫహద్ ఫాసిల్ పాత్ర పరిచయం అవుతుంది. వడివేలు, ఉదయనిధి ఒకవైపు, ఫహద్‌ మరోవైపు.. వీరి మధ్య పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ఉండబోతుందని ట్రైలర్ ఎస్టాబ్లిష్ చేసింది. వడివేలు, ఉదయనిధి స్టాలిన్, ఫహద్ ఫాసిల్ ల ఫెర్ ఫార్మెన్స్ ఎక్స్ టార్దినరిగా వుంది. కీర్తి సురేష్ కీలక పాత్రలో ఆకట్టుకున్నారు.

ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ అందించిన నేపధ్య సంగీతం ఇంటెన్సిటీ మరింత ఎలివేట్ చేసింది. కెమరా పనితనం, నిర్మాణ విలువలు వున్నంతంగా వున్నాయి. మరిసెల్వరాజ్ ‘నాయకుడు’తో మరో హార్డ్ హిట్టింగ్ టెర్రిఫిక్ సినిమా అందించారని ట్రైలర్ భరోసా ఇచ్చింది. తెలుగులో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ చిత్రం జూలై 14న తెలుగు రాష్ట్రాల థియేట ర్లలో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News