Tuesday, December 24, 2024

నయన మనోహరం..మాతేశ్వరి ఘటోత్సవం

- Advertisement -
- Advertisement -

చాంద్రాయణగుట్ట: పాతనగర వీధుల్లో మాతేశ్వరీ ఘటాల ప్రతిష్టాపన ఊరేగింపు ఆదివారం సాయంత్రం నేత్రపర్వంగా సాగింది. చిరుజల్లులు…డప్పు వాయుద్యాలు.. బ్యాండు మేళాల మోతలు…కళాకారుల ప్రదర్శనలు … అడుగడుగునా స్వాగత వేదికలు.. ప్రముఖుల స్వాగతం.. బారీ పోలీసుల బందోబస్తు మధ్య అందంగ తీర్చిదిద్దిన మాతేశ్వరీ ఘటాలతో పాతనగరంలో బోనాల పండగ శోభ ఉట్టి పడింది. ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు క మిటీ ఆధ్వర్యంలో జరిగిన ఊరేగింపులో వందలాదిమంది భ క్తులు పాల్గొని మాతేశ్వరి ఘటాలను, కళాకారుల ప్రదర్శనలను, తీరొక్క శ కటాలను తిలకించారు.

లాల్‌దర్వాజా మోడ్ వద్ద ఏర్పాటు చేసిన ఉమ్మడి వేదిక నుండి మాజీ ఎం పి ఎం.అంజన్ కుమార్ యాదవ్, గౌలిపురా కార్పొరేటర్ ఆలె భాగ్యలక్ష్మి,ఉమ్మడి అధ్యక్షులు ఆలె భాస్కర్‌రాజ్, ప్రధాన కార్యదర్శి గాజుల రాహుల్ (గబ్బర్), ఉమ్మడి మాజీ అధ్యక్షులు గాజుల అంజయ్య, రాకేష్ తివారీ తదితరులు మాతేశ్వరి ఘటాలకు స్వా గతం పలికారు. కొబ్బరి కాయలు సమర్పించి హా రతి ఇచ్చారు. ఊరేగింపులో అగ్రభాగానా లాల్‌దర్వాజా శ్రీ సింహవాహి ణ మహాంకాళి ఆలయ ఘటం నిలువగా దానిని ఉప్పుగూడ శ్రీ మహాంకాళి ఆలయం, సుల్తాన్‌షాహి శ్రీజగదాంబ ఆలయం, సుల్తాన్‌షాహి బంగారు మైసమ్మ ఆలయం, గౌలిపురా శ్రీ మహంకాళి మాతేశ్వరి భారతమాత కోటమైసమ్మ దేవాలయం…తదితర దేవాలయాలు ఆనుసరించాయి. హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న మ హంకాళి దేవాలయం ఘటం చివర నిలిచింది.

ఉమ్మడి పరిధిలోని 25 దేవాలయాలలో 20 మాతేశ్వరి ఘటాలు ఊరేగింపులో పాల్గొన్నాయి. ఇలా బోనాల జాతర ఉత్సవాలలో ప్రధాన ఘట్టాన్ని ఆవిష్కృతమైయ్యింది. ఘట ప్రతిష్టాపన ఊరేగింపు శాలిబండ శ్రీ కాశీ విశ్వనాథ మందిరం నుండి ప్రారంభమై లాల్‌దర్వాజా మోడ్ మీదుగా లాల్‌దర్వాజా, ఛత్రినాక , ఉప్పుగుడా వైపుసాగగా మరో ఊరేగింపు ఛత్రినాక నుండి గౌలిపురా, సుల్తాన్‌షాహి, బేలా చందూలాల్, రాంబక్షిబండ, హరిబౌలి, కోవాబేలా మీదుగా ఆయా ఆలయాలకు చేరుకున్నాయి. ఊరేగింపు అర్ధరాత్రి వరకు సాగింది. ఆనంతరం ఆలయాలలో పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి మాతేశ్వరీ ఘటాలను ప్రతిష్టించారు.

వారం రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాలలో పూజిస్తారు. ఈ ఘటాల ఊరేగింపులో వివిధ జిల్లాల నుండి వచ్చిన జానపద కళాకారులు ప్రదర్శించిన ప్రదర్శనలు, అమ్మవారి, నటరాజు, బోనాల వంటి భారీ విగ్రహాలు, డీజే పాటలు, కళ్లు మిరిమిట్లు గొల్పే విద్యుత్ దీపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దక్షిణ మండల డీసీపీ పి.సాయి చైతన్య నేతృత్వంలో విస్తృత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఊరేగింపులో ఆయా ఆలయాల ప్రతినిధులు ఎర్మని కైలాష్ గంగపుత్ర, ఎ.మధుసూదనగిరి, ఇ.సుమన్ కుమార్, బొడ్డు సాయిబాబ, ఎ.రాజు, సి.రాజేందర్ యాదవ్, బి.మారుతీ యాదవ్, పోసాని సదానంద్ ముదిరాజ్, జి.అరవింద్ కుమార్ గౌడ్, రాందేవ్ అగర్వాల్, జి.రాజరత్నం, డాక్టర్ ఆవుల భరత్ ప్రకాష్, ఎస్.పి.క్రాంతి కుమార్, పొటేల్ సదానంద్ యాదవ్, పొటేల్ కిషన్ యాదవ్, పొటేల్ రాము యాదవ్, పొటేల్ శ్రీనివాస్ యాదవ్, జె.మధుసూదన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News