Friday, January 24, 2025

మరో వివాదంలో నయనతార… ఆ తప్పును క్షమించాలి: విఘ్నేశ్

- Advertisement -
- Advertisement -

 

తిరుమల: తిరుమాడ వీధుల్లో హీరోయిన్ నయనతార చెప్పులు ధరించి తిరగడంతో వివాదంగా మారింది. నవ దంపతులు విఘ్నేశ్ శివన్, నయనతార నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నయనతారి పాదరక్షలు ధరించి తిరుమాడ వీధుల్లో తిరగడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనీపై విజిలెన్స్ అధికారి బాల్ రెడ్డి స్పందించారు. నయనతార చెప్పులు ధరించడం దురదృష్టకరమని, ఫొటో షూట్ చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. న్యాయనిపుణుల సలహా తీసుకున్న తరువాత నయనతారపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫోటోషూట్‌కు అనుమతించిన సిబ్బందితో పాటు నయనతార పాదరక్షలు ధరించి రావడంతో శ్రీవారి సేవకుల వైఫల్యంగా పరిగనిస్తున్నామని, సిబ్బందిపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కాళ్లకు పాదరక్షలు ఉన్న సంగతి తమకు గుర్తులేదని విఘ్నేశ్ శివన్ తెలిపాడు. దేవుడిపై తమకు భక్తి, అపారమైన నమ్మకం, తాము తెలియని చేసిన తప్పుకు క్షమించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News