Monday, December 23, 2024

సరికొత్త థీమ్ సినిమాలో నటి నయన తార !

- Advertisement -
- Advertisement -

 

NayanaTara

హైదరాబాద్:  ఎకనామిక్‌ హిట్‌మ్యాన్‌ ఒక దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా నాశనం చేస్తారు అనేది చాలా మందికి తెలియని రహస్యం. ఇప్పుడు అదే థీమ్‌తో ‘పేపర్ బాయ్’ ఫేమ్‌ జయశంకర్‌  ఓ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. త్వరలో ఆయన నయనతారతో  ఓ లేడి ఓరియెంటెడ్‌ మూవీని తెరకెక్కింబోతున్న విషయం తెలిసిందే. తొలుత ఈ చిత్రానికి కాజల్‌ని హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ ప్రెగ్నెన్సీ కారణంగా ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. దీంతో కాజల్‌ ప్లేస్‌లో నయనతారను తీసుకున్నారు. ఇప్పటికే దర్శకుడు నయన్‌కు స్టోరీ వినిపించాడట.ఆమెకు కథ బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందట. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

 ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ రూమర్‌ ఒకటి బయటకు వచ్చింది. తెలుగులో ఇంతవరకు ఎవరు టచ్‌ చేయని సరికొత్త పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడట జయశంకర్‌. ఎకనామిక్‌ హిట్‌మ్యాన్‌ అనే సరికొత్త కాన్సెప్ట్‌ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడట. ఎకనామిక్‌ హిట్‌మ్యాన్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థని ఎలా కంట్రోల్‌ చేస్తారు? వారు ఓ దేశ ఆర్థిక వ్యవస్థని ఎలా నాశనం చేస్తారనే విషయాన్ని తెరపై చూపించబోతున్నాడట. రీవేంజ్‌ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో నయనతార సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందించబోతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటులు కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News