Wednesday, January 22, 2025

పుకార్లకు చెక్ పెట్టిన నయనతార, విఘ్నేశ్

- Advertisement -
- Advertisement -

నయనతార, విఘ్నేశ్ శివన్ విడిపోతున్నారంటూ వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది. ఈ జంట తాజాగా సోషల్ మీడియాలో చేసిన పోస్టులు తాము విడిపోలేదన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

కొన్ని రోజుల క్రితం నయనతార ఇన్ స్టాలో తన భర్తను అన్ ఫాలో చేశారు. మరికొంతసేపటికి మళ్లీ ఫాలో చేశారు. దీంతో వారిద్దరిమధ్యా ఏదో జరుగుతోందంటూ పుకార్లు మొదలయ్యాయి. ఆ తర్వాత నయనతార ‘నేను అన్నీ కోల్పోయాను’ అంటూ పెట్టిన మరో పోస్ట్ తో ఈ పుకార్లు ఊపందుకున్నాయి. దీంతో ఇద్దరిమధ్య గొడవలు జరుగుతున్నాయనీ, విడాకులు తీసుకుంటారని జోరుగా రూమర్స్ వచ్చాయి.

అయితే ఉమెన్స్ డే సందర్భంగా తన భార్య నయనతారకు విఘ్నేశ్ శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అందుకు ప్రతిగా నయనతార ‘నన్ను ఒక గొప్ప మహిళగా తీర్చిదిద్దినందుకు ధన్యవాదాలు’ అంటూ లవ్ ఎమోజీలు పెట్టారు. దీంతో వారిపై వస్తున్న వదంతులకు ఫుల్ స్టాప్ పడింది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న నయనతార, విఘ్నేశ్ ల జంట తమ పర్యటనకు సంబంధించిన వీడియోలను కూడా నెటిజన్లతో పంచుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News