Thursday, January 23, 2025

నయనానందకరంగా వివాహం

- Advertisement -
- Advertisement -

సౌతిండియా లేడీ సూపర్ స్టార్ నయతార, తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌ల వివాహం గురువారం మహాబలిపురంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, సూపర్ స్టార్లు రజినీకాంత్, అజిత్, దర్శకుడు అట్లీ, బోనీకపూర్, విజయ్ సేతుపతితో పాటు పలువురు తమిళ సినీ ప్రముఖులు హాజరయ్యారు. మహాబలిపురంలోని ఒక స్టార్ హోటల్‌లో వీరి వివాహం జరిగింది. నయనతారతో వివాహం తర్వాత విఘ్నేశ్ శివన్ తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. పెళ్లి ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు. “ఇప్పుడే మా పెళ్లి అయింది. మా జంటకు 10మార్కులు వేస్తే, నయన్‌కు 9, నాకు 1 వస్తాయి. దేవుడు, తల్లిదండ్రులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో మేము మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యాం” అని విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. వీరి పెళ్ళి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. నయనతార, విఘ్నేష్ శివన్‌ల పెళ్లి ఫోటోలను చూసి ప్రేక్షకులు, అభిమానులు మైమరచిపోయ వారికి వివాహ శుభాకాంక్షలు చెప్పారు. అదేవిధంగా నయనతార, విఘ్నేష్ దంపతులకు సినీ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు.

Nayanthara and Vignesh Shivan get engaged

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News