Sunday, February 23, 2025

నయనతార డాక్యుమెంటరీ ట్రైలర్‌ రిలీజ్‌

- Advertisement -
- Advertisement -

లేడీ సూపర్ స్టార్ నయనతార జీవితాన్ని ఆధారంగా చేసుకుని నెట్‌ఫ్లిక్స్ ఒక డాక్యుమెంటరీ రూపొందించింది.
‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ అనే టైటిల్‌ తో తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీ ట్రైలర్‌ శనివారం రిలీజ్‌ అయ్యింది. ఇందులో నయతార గురించి సినీ సెలబ్రెటీలు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

శింభు, ప్రభుదేవాలతో కొన్నిరోజుల పాటు రిలేషన్ షిప్ కొనసాగించిన నయనతార.. వారికి బ్రేకప్ చేప్పి చివరగా డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సినిమాల్లో సక్సెస్ అయినా.. పర్సనల్ లైఫ్ లో నయన్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విఘ్నేష్ తో పెళ్లి తర్వాత తన కెరీర్ ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ దంపతులకు కవల పిల్లలు జన్మించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News