Monday, December 23, 2024

చీరలో సంప్రదాయబద్ధంగా సత్యప్రియ

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి క్రేజీ ప్రాజెక్ట్ ‘గాడ్ ఫాదర్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. అలాగే చాలా మంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మెగాస్టార్ చిరంజీవి తొలిసారి ఈ చిత్రంలో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపిస్తున్నారు. చిరంజీవి పాత్రను పరిచయం చేస్తూ ఇటీవల విడుదలైన గ్లింప్స్, టీజర్ లకు అద్భుతమైన స్పందన వచ్చింది. గురువారం ఈ సినిమాలో నయనతార పాత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు.

ఇందులో ఆమె సత్యప్రియ జైదేవ్ పాత్రను పోషిస్తున్నారు. నయనతార చీరలో సాంప్రదాయకంగా కనిపిస్తున్నారు.త్వరలోనే చిత్ర యూనిట్ మ్యూజికల్ ప్రమోషన్స్‌ని ప్రారంభించనున్నారు. పూరి జగన్నాధ్, సత్యదేవ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా, ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ నిర్మిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పిస్తున్నారు. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘గాడ్ ఫాదర్’ ఈ ఏడాది అక్టోబర్ 5న దసరా కానుకగా విడుదల కానుంది.

Nayanthara first look out from ‘Godfather’ Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News