Monday, December 23, 2024

కవల అబ్బాయిలకు జన్మనిచ్చిన నయన్

- Advertisement -
- Advertisement -

Nayanthara gave birth to twin boys

స్టార్ హీరోయిన్ నయనతార ఆదివారం పండంటి కవలలకు జన్మనిచ్చారు. నయన్, విఘ్నేష్ శివన్ దంపతులు తల్లిదండ్రులయ్యారు. ఈ విషయాన్ని విఘ్నేశ్ శివన్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ‘నేను, నయన్ తల్లిదండ్రులమయ్యాం. మాకు ఇద్దరు మగ కవల పిల్లలు పుట్టారు. మా ప్రార్థనలు, పెద్దల ఆశీస్సులు ఫలించాయి. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి” అని ఇద్దరు బిడ్డల పాదాలకు ముద్దు పెడుతున్న ఫోటోలను విఘ్నేష్ శివన్ షేర్ చేసారు. ఇక, ఆరేళ్లగా ప్రేమలో ఉన్న ఈ కోలీవుడ్ జంట ఈ ఏడాది జూన్ 9న పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా నయనతార మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన ‘గాడ్‌పాదర్’ చిత్రం దసరా కానుకగా విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News