Monday, December 23, 2024

నటి నయనతార త్వరలో ఓ థియేటర్ ఓనర్ కాబోతున్నారు!

- Advertisement -
- Advertisement -

చెన్నై: నయనతార ఏది చేసిన వినూత్నంగా ఉంటుంది. ఆమె పెళ్లి, మాతృత్వం అన్ని విశేషాలుగానే నిలిచాయి. ఇప్పుడు ఆమె చెన్నైలో ఓ థియేటర్ నడుపబోతున్నారని వార్త. ఆమె ఇటీవల సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయ్యారు. ఆమె సినిమా పరిశ్రమలో డామినేట్ చేయడమే కాదు. విస్తరిస్తున్నారు కూడా. నయనతార జీవిత పంథా, వృత్తి అన్నీ ప్రత్యేకమే.

టాలెంటెడ్ నటి అయిన నయనతార ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా తన ప్రత్యేకత చాటుకోవాలని చూస్తోంది. ఆమె షారూఖ్ ఖాన్‌తో నటించబోతోంది. అట్లీ నిర్మిస్తున్న ‘జవాన్’ సినిమాలో ఆమె కనిపించబోతున్నారు.

నయనతార తాజాగా థియేటర్ ఇండస్ట్రీలో కూడా తన సత్తా చాటాలనుకుంటున్నారు. ఆమె చెన్నైలో వాడకుండా వదిలేసిన ‘అగస్త్య థియేటర్’ను కొని,  మల్లీప్లెక్స్‌గా పునర్నిర్మించి నడుపాలనుకుంటున్నారని వార్త. ఈ మధ్య దక్షిణాదిలో చాలా మంది నటులు థియేటర్లను నిర్మించ నడిపిస్తున్నారు. ఉదాహరణకు మహేశ్ బాబు ఎఎంబి, అల్లూ అర్జున్ ఎఎఎ థియేటర్లను చెప్పుకోవాలి. వారి బాటలోనే ఇప్పుడు నయనతార నడువబోతున్నారు. థియేటర్ జగత్తులో తన లక్ ఏమిటో చూసుకోవాలనుకుంటున్నారామె.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News