Monday, April 28, 2025

మరోసారి చిరుకు జోడీగా నయనతార..!

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి కాంబినేషన్ ఓ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా పూజాకార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ రూమర్ నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ చిత్రంలో చిరు సరసన మరోసారి నయనతార నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. నయనతార తోపాటు ఇందులో బాలీవుడ్ నటి పరిణితి చోప్రా కూడా కీలక పాత్రలో నటిస్తారని సినీ వర్గాల టాక్. ఇప్పటికే నయనతార..చిరుకు జోడీగా సైరా సినిమా చేసిన విషయం తెలిసిందే. అయితే, అందులో సాంగ్స్ కు గానీ, రొమాన్స్ కు గానీ పెద్దగా స్కోప్ లేకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు.

ఇక, గాడ్ ఫాదర్ లో చెల్లిగా నటించినా.. ఇద్దరి మధ్య డైలాగ్స్ లేవు. ఈ క్రమంలో అనిల్ తెరకెక్కించబోయే సినిమాలో చిరు, నయన్ కలిసి నటిస్తే.. ఫ్యాన్స్ కు పండగనే చెప్పాలి. ఈ సినిమా కామెడీ, మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందనుంది. ఇందులో అనిల్.. వింటేజ్ మెగాస్టార్ ను చూపించనున్నట్లు తెలుస్తోంది. దీంతో చిరు-నయన్ మధ్య రోమాన్స్, సాంగ్స్ చూసి అభిమానులు ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. కాగా, ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News