Monday, December 23, 2024

అచ్చేదిన్ కాదు.. మధ్యతరగతి కుటుంబాలు సచ్చెదిన్

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: అచ్చేదిన్ కాదు.. మద్య తరగతి కుటుంబాలకు సచ్చేదిన్ కేంద్ర బడ్జెట్‌లో ఎవరికి లాభం అంటూ నాయిబ్రహ్మణం సంఘం జిల్లా అద్యక్షుడు కొత్వాల్ యాద నరేందర్ ప్రశ్నించారు. గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… అచ్చేదిన్ అచ్చేదిన్ అంటూ సచ్చేదిన్ తెస్తుంది కేంద్ర ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. గతానికి తోడుగా ఈ బడ్జెట్ కూడా అంతా కార్పోరేట్ల కోరకు కేటాయింపు అన్నట్లుగా ఉందన్నారు. దేశ జనాబాలో ఎనబై శాతానికి పైగానే ఉండే మద్యతరగతి కుటుంబాలకు ఈ బడ్జెట్ ఎలాంటి సంతృప్తి ఇవ్వట్లేదన్నారు. గ్రామీణ, పట్టణ మద్య తరగతి కుటుంబాల వారందరికి ప్రశ్నార్ధకమైనది. జీవనంలో తలసరి ఆదాయంకు మించిన భారంగానే వారి బ్రతుకులు ఉన్నాయన్నారు. మద్య తరగతి కుటుంబాలకు మేలు చేసే దారేముందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News