Monday, December 23, 2024

వాళ్లకు మంగళ వాయిద్య శిక్షణలో ప్రత్యేక శిక్షణ తరగతులు: శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

Nayi brahmin caste in telangana

హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్రంలో నాయీ బ్రాహ్మణుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్ నగరంలో నాయీ బ్రాహ్మణుల ఆత్మగౌరవం కోసం ఎంతో విలువైన ఒక ఎకరం భూమి, భవన నిర్మాణం కోసం కోటి రూపాయలను సిఎం కెసిఆర్ కు కేటాయించారని గుర్తు చేశారు. రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్  హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో ఎసియా అవార్డు చేజింగ్ ది ఎక్స్ లెన్స్ అనే సంస్థ కర్నాటక సంగీతం లో నోబెల్ అచీవ్ అవార్డును ఖమ్మం జిల్లాకు చెందిన డా. షైక్ జాన్ పాషా, డా. అరేపల్లి నాగరాజు లు సాధించిన సందర్భంగా అభినందించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. నాయీ బ్రాహ్మణుల వృత్తిని ప్రోత్సాహించేందుకు సెలూన్ లకు, బ్యూటీ పార్లర్ లకు ఉచిత విద్యుత్ ను అందిస్తున్నామన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలో సంగీత కళాశాలను ప్రారంభించామన్నారు. ఈ కళాశాలలో నాయీ బ్రాహ్మణులకు మంగళ వాయిద్య శిక్షణలో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించి అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నామని శ్రీనివాస్ గౌడ్  స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంగళ వాయిద్య కళాకారుల సంఘం ప్రతినిధులు ఎఎం తులసీదాసు, నాగబెల్లి సునీల్ నాయీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News