Wednesday, January 22, 2025

మోడీపై పిహెచ్‌డి… తొలి ముస్లిం మహిళగా రికార్డు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా భారత ప్రధాని నరేంద్ర మోడీని ప్రపంచ గురువుగా ప్రజలు పిలిచుకుంటారు. మోడీ చరీష్మా రోజు రోజుకు పెరుగుతుంది తప్ప తరగడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీపై ఓ ముస్లిం మహిళ పిహెచ్‌డి చేసింది. ప్రధాని నరేంద్ర మోడీపై పిహెచ్‌డి చేసిన భారత తొలి ముస్లిం మహిళగా నజ్మా పర్వీన్ నిలిచింది. 2014లో మోడీపై పరిశోధన ప్రారంభించి పూర్తి చేసేందుకు దాదాపుగా ఎనిమిదేళ్లు పట్టిందని ఆమె పేర్కొంది. కాశీ హిందూ విశ్వవిద్యాలయం నుంచి ప్రొఫెసర్ సంజయ్ శ్రీ నేతృత్వంలో ఆమె పిహెచ్‌డి చేసింది.

ప్రధాని మోడీ హిందువులు ఎంతగా అభిమానిస్తారో ముస్లింలు కూడా అంతే ఆదరిస్తారని పరిశోధనల్లో వెల్లడైందని బనారస్ హిందూ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజీవ్ పేర్కొన్నారు. పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ కింద తాను ఓ రాజకీయ నాయకుడు జీవిత చరిత్ర అవసరం కావడంతో తాను ప్రధాని మోడీని ఎంచుకున్నానని మీడియాకు నజ్మా వివరించారు. మోడీ కులానికో, మతానికో చెందిన వ్యక్తి కాదని దేశం మొత్తానికి చెందిన వ్యక్తి ఆమె పేర్కొంది. దేశ రాజకీయ నాయకులలో మోడీ జీవితం తనను అమితంగా ఆకట్టుకుందని ఆమె తెలిపింది. దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన రాజకీయ నేతగా మోడీ కనిపించారని ప్రశంసించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News