Thursday, January 23, 2025

‘అంటే సుందరానికీ’ అరుదైన కథ

- Advertisement -
- Advertisement -

Nazrea Nazeam interview about 'Ante Sundaraniki'

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ’అంటే సుందరానికీ’. నజ్రియా తెలుగులో పరిచయం కాబోతున్న ఈ చిత్రంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఈనెల 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్ , మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపధ్యంలో హీరోయిన్ నజ్రియా మీడియాతో మాట్లాడుతూ.. “నేను ‘అంటే సుందరానికీ’ కథను ఒక ప్రేక్షకురాలిగానే విన్నా. కథ అద్భుతంగా అనిపించింది. ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్స్ .. ఇలా అన్నీ భావోద్వేగాలు ఒక కథలో కుదరడం చాలా అరుదు. ‘అంటే సుందరానికీ’ అంత అరుదైన కథ. నేను చేసిన లీలా థామస్ పాత్రలో చాలా లేయర్స్ ఉన్నాయి. లోపల బాధ వున్నా అది బయటికి కనిపించనీయకూడదు. దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ పాత్రని అద్భుతంగా డిజైన్ చేశారు. నాని గ్రేట్ కోస్టార్. ’అంటే సుందరానికీ’ ప్రయాణంలో మేము మంచి ఫ్రండ్స్ అయిపోయాం. నానికి స్టార్ అనే ఫీలింగ్ వుండదు. ఆయన నిజాయితీ గల యాక్టర్. అలాగే నరేష్, నదియా గారితో పని చేయడం కూడా గొప్ప అనుభవం. వారి నుండి చాలా నేర్చుకున్నా. ఇది నా మొదటి తెలుగు సినిమా అయినప్పప్పటికీ .. ప్రేక్షకులకు నేను బాగా తెలుసు. ఇది నా కమ్ బ్యాక్ మూవీ. డబ్బింగ్ కూడా చెప్పా. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే ఆందోళన వుంది”అని అన్నారు.

Nazrea Nazeam interview about ‘Ante Sundaraniki’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News