Thursday, January 23, 2025

షైన్ స్క్రీన్స్ బ్యానర్‌లో క్రేజీ కాంబినేషన్

- Advertisement -
- Advertisement -

నటసింహ నందమూరి బాలకృష్ణ, డబుల్ బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్‌కు సర్వం సిద్ధమైంది. ఎన్‌బికె 108 వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని బాలకృష్ణ పుట్టినరోజున అధికారికంగా ప్రకటించారు. గురువారం చిత్ర నిర్మాతలు, సంగీత దర్శకులకు సంబంధించిన ప్రకటన వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ చిత్రానికి స్టార్ కంపోజర్ తమన్ సంగీతం అందించనున్నారు. ఈ సందర్భంగా త్వరలో బాంబార్డింగ్… అంటూ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభానికి సంబంధించి ప్రకటన వీడియోని విడుదల చేశారు మేకర్స్. మాస్ పల్స్ తెలిసిన అనిల్ రావిపూడి… బాలకృష్ణ కోసం విభిన్నమైన, మాస్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారు. బాలయ్యని మునుపెన్నడూ చూడని పాత్రలో చూపించబోతున్నారు.

NBK 108 Movie Concept Teaser Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News