Saturday, January 18, 2025

21న టైటిల్ ప్రకటన

- Advertisement -
- Advertisement -

#NBK107 Movie Title announcement on Oct 21

నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనిల క్రేజీ ప్రాజెక్ట్ ‘ఎన్‌బికె 107’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఫస్ట్‌లుక్, టీజర్‌కు వచ్చిన అద్భుతమైన స్పందనతో సినిమా అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ సినిమా నుండి బిగ్ అప్డేట్ వచ్చింది. ‘ఎన్‌బికె 107’ టైటిల్‌ను ఈనెల 21న విడుదల చేయనున్నారు. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందింస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్. ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్‌గా రామ్-లక్ష్మణ్ పని చేస్తున్నారు.

#NBK107 Movie Title announcement on Oct 21

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News