Monday, December 23, 2024

గోపీచంద్ మలినేనితో మూవీ వచ్చేది అప్పుడేనా?

- Advertisement -
- Advertisement -

NBK107 Movie will release on Dec 23

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న సినిమా దాదాపు కీలక టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. ఈ సినిమాని డిసెంబర్ 23వ తేదీన రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రస్తుతం బాలకృష్ణపై హై యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. రామ్, లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రుతి హాసన్ నటిస్తోంది. తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇటీవల ‘క్రాక్’ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ కొట్టి యాక్షన్ డైరెక్టర్‌గా గోపీచంద్ మలినేని స్టార్‌డమ్ సాధించాడు. అయితే ప్రస్తుతం బాలయ్యతో సినిమా చేస్తున్న గోపీచంద్ ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి.

NBK107 Movie will release on Dec 23

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News