Wednesday, January 22, 2025

‘ఎన్‌సి22’.. మైసూర్‌లో కీలక సన్నివేశాలు పూర్తి

- Advertisement -
- Advertisement -

'NC22'.. Key scenes completed in Mysore

హీరో అక్కినేని నాగచైతన్య, దర్శకుడు వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో ‘ఎన్‌సి22’గా తెరకెక్కుతున్న చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే చిత్ర తారాగణాన్ని ప్రకటించారు నిర్మాతలు. ఇటీవల సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమా మైసూర్‌లో కీలక షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్‌లో నాగ చైతన్యకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మైసూర్‌లోని అందమైన లొకేషన్లలో ఈ షెడ్యూల్‌ను పూర్తి చేసింది చిత్ర బృందం. ఈ చిత్రంలో నాగచైతన్య పూర్తిగా భిన్నమైన అవతార్‌లో కనిపించనున్నారు. చైతన్య కెరీర్‌లో అత్యంత భారీ చిత్రంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దిగ్గజ సంగీత దర్శకులైన తండ్రీ కొడుకులు ఇసైజ్ఞాని ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించడం మరో విశేషం. స్టార్ డైలాగ్ రైటర్ అబ్బూరి రవి మాటలు అందిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని పవన్‌కుమార్ సమర్పిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News