Sunday, December 22, 2024

షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు ఎన్‌సిబి క్లీన్ చిట్

- Advertisement -
- Advertisement -

Aryan Khan

ముంబై:  గత ఏడాది నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్టయిన ప్రసిద్ధ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) తన ఛార్జ్ షీట్ సమర్పించింది. ఏజెన్సీ విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం, ఎన్‌సిబి  14 మంది వ్యక్తులపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అయితే, ఇందులో ఆర్యన్‌ని చేర్చలేదు. “ఆర్యన్ (ఖాన్), మోహక్ (జైస్వాల్) మినహా నిందితులందరూ మాదకద్రవ్యాలను కలిగి ఉన్నట్లు గుర్తించారు” అని నోట్ పేర్కొంది.  ‘సిట్’ తన దర్యాప్తును “ఆబ్జెక్టివ్ పద్ధతిలో” నిర్వహించిందని తెలిపింది.

డ్రగ్స్ కేసులో ఎన్‌సిబి అరెస్టు చేసిన మోహక్ జైస్వాల్‌కు గత నవంబర్‌లో ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జైస్వాల్ పూర్తిగా నిర్దోషి అని, అతనికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని, ఆరోపించిన నేరంలో కేంద్ర ఏజెన్సీ అతనికి ఎటువంటి “ప్రత్యక్ష పాత్ర” ఆపాదించలేదని బెయిల్ పిటిషన్‌లో పేర్కొంది. ఈ కేసులో 20 మందిని అరెస్టు చేశారు, అందులో 12 మందికి ప్రత్యేక ఎన్ డిపిఎస్ కోర్టు బెయిల్ మంజూరు చేయగా, బాంబే హైకోర్టు ఆర్యన్ ఖాన్‌తో సహా మరో ముగ్గురికి బెయిల్ మంజూరు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News