Saturday, November 23, 2024

సరిహద్దు, తీరప్రాంతాల్లోని స్కూళ్లలో ఎన్‌సిసి శిక్షణ

- Advertisement -
- Advertisement -

NCC training in border and coastal area schools

 

1,100కు పైగా పాఠశాలలను గుర్తించిన కేంద్రం
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడి

న్యూఢిల్లీ : నేషనల్ క్యాడెట్ కార్ప్ (ఎన్‌సిసి) కింద విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి సరిహద్దులు, తీర ప్రాంతాల్లో ఉన్న 1,100కు పైగా పాఠశాలలను గుర్తించిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం చెప్పారు. ‘ ఎన్‌సిసిని విస్తరించాలని మన ప్రధాని నిర్ణయించారు. సరిహద్దు ప్రాంతాలు, తీరప్రాంతాల్లో శ్రీన్‌సిసి శిక్షణను అందించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ఈ ప్రాంతాల్లోని 1,100కు పాఠశాలలను గుర్తించడం జరిగింది. ఈ పాఠశాలల్లో విద్యార్థులకు ఎన్‌సిసి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది’ అని రాజ్‌నాథ్ చెప్పారు. ఇంతకు ముందు ఎన్‌సిసిలో కేవలం 23 శాతం మంది మహిళా క్యాడెట్లు ఉండేవారని, ఇప్పుడది 43 శాతంగా ఉందని ఇక్కడ ఒక ఎన్‌సిసి శిబిరంలో ప్రసంగిస్తూ మంత్రి చెప్పారు. దాదాపు నెల రోజుల పాటు జరిగే ఈ శిబిరంలోని దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన వెయ్యిమంది క్యాడెట్లు పాలొంటున్నారు.

వీరిలో 380 మంది మహిళా క్యాడెట్లు కూడా ఉన్నారు. ఈ నెల 28న శిబిరం ముగుస్తుంది. కరోనా వ్యాక్సిన్ల గురించి మాట్లాడుతూ దేశంలో రెండు టీకాలు తయారవుతున్నాయని రాజ్‌నాథ్ చెప్పారు. ప్రపంచమంతా ఒకే కుటుంబంగా భారతీయులు భావిస్తారని, భారత్‌లో టీకాలు ఇవ్వడంతో పాటుగా అవసరమైతే పొరుగు దేశాలకు కూడా టీకాలు అందజేస్తామని ఆయన చెప్పారు. అంతేఏకాదు, అవసరమైతే ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా అందజేస్తామని రాజ్‌నాథ్ చెప్పారు. ఉద్యోగాల కల్పన విషయంలో ఎన్‌సిసి క్యాడెట్లకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, తనకు తెలిసినంతవరకు ఆ మేరకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని, ఎంపిక ప్రక్రియలో ఎన్‌సిసి క్యాడెట్లకు అదనంగా మార్కులు ఇవ్వడం జరుగుతోందని రక్షణ మంత్రి చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News