రిపోర్టుల ప్రకారం ప్రజాస్వామ్యం, పీరియాడిక్ టేబుల్, సోర్స్ ఆఫ్ ఎనర్జీ అధ్యాయాలు తొలగించారు.
న్యూఢిల్లీ: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రయినింగ్ (ఎన్‌సిఈఆర్‌టి) కొత్తగా విడుదల చేసిన పాఠ్యపుస్తకాలలో ఇప్పుడు 10వ తరగతి విద్యార్థులపై భారం తగ్గించడానికి ‘ప్రజాస్వామ్యం’ అనే అధ్యాయాన్ని తొలగించాయి. రిపోర్టుల ప్రకారం ప్రజాస్వామ్యం అధ్యాయమే కాకుండా ఆవర్తన పట్టిక(పీరియాడిక్ టేబుల్), శక్తి మూలం(సోర్స్ ఆఫ్ ఎనర్జీ) అధ్యాయాలను కూడా తొలగించారు.
ఎన్‌సిఈఆర్‌టి 10వ తరగతి పుస్తకంలో ప్రజాస్వామ్య రాజకీయాలు-1 అనే సబ్జెక్ట్ ఉంది. కొత్తగా విడుదల చేసిన సంస్కరణలో ప్రముఖ పోరాటాలు, ఉద్యమాలు, రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్యానికి సవాళ్లు వంటివి తొలగించారు.
ఇంతేకాకుండా, సైన్స్ విద్యార్థులు ఇకపై మూలకాల ఆవర్తన వర్గీకరణ(పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్), శక్తి వనరులు(సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ), సహజ వనరుల సస్టెయినబుల్ మేనేజ్‌మెంట్‌లను చదవాల్సిన అవసరం లేదు.( ఇంకా తాజా సమాచారం అందాల్సి ఉంది).