Monday, December 23, 2024

12 క్లాసు పుస్తకంలో తీసివేతలు.. చరిత్ర గాయబ్

- Advertisement -
- Advertisement -

మెఘలుల చరిత్ర గాయబ్
భారం తగ్గించేందుకే : ఎన్‌సిఇఆర్‌టి
ఓ సిద్ధాంతానికి వంతపాటే: ఏచూరి

న్యూఢిల్లీ : సిబిఎస్‌ఇ పన్నెండవ తరగతి సాంఘీక శాస్త్రం పుస్తకంలోని రాజులు వారి వంశాలు, మొఘలుల రాజరికాలు పాఠ్యాంశాలను తొలిగించివేశారు. మధ్యయుగపు చరిత్ర సంబంధిత ప్రధాన విషయాలను తెలిపే ఈ రెండు అంశాలను తీసివేయడం వివాదాస్పదం అయింది. అయితే దీని వెనుక ఎటువంటి రాజకీయ లేదా మత పరమైన మొగ్గు ప్రక్రియ ఏదీ లేదని ఎస్‌సిఇఆర్‌టి మంగళవారం వివరణ ఇచ్చింది. ఇది కేవలం విద్యాపరమైన ఇబ్బందులను తొలిగించే పనిలో భాగం అని తెలిపారు.

కోవిడ్ మహమ్మారి దశలో విద్యార్థులపై సిలబస్ భారం తగ్గించేందుకు ఈ రెండు అంశాలను తొలిగించివేశారని, రాజకీయ ఉద్ధేశాలు ఏమీ లేవని స్పష్టం చేశారు. దురుద్ధేశాలు ఉన్నాయనే విమర్శలు అనుచితం అని కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్‌సిఇఆర్‌టి ప్రకటన వెలువరించింది. పాఠ్యపుస్తకాలలో బరువు తగ్గించేందుకు గత చరిత్ర విషయాలను కొంత మేరకు తగ్గించినట్లు సంస్థ డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లాని తెలిపారు. విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడమే తమ పని అన్నారు. జరిగిన పని పూర్తిగా కేవలం ప్రొఫెషనరల్ అన్నారు. ఓ సిద్ధాంతానికి అనుగుణంగా ఈ సిలబస్ తీసివేశారనే విమర్శలను తోసిపుచ్చారు.

ఎన్‌సిఇఆర్‌టి తీసుకున్న నిర్ణయం మతపరమైనదని సిపిఎం నేత సీతారాం ఏచూరి విమర్శించారు. భారతదేశం అంటేనే విభిన్న వర్గాలు సమాజాల సమ్మేళనం, భిన్న రీతుల ప్రవాహ సారూప్యతను సంతరించుకుని నిలిచిన భారతీయ చరిత్రలోని కీలకమైన నాగరికతా పరిణామాలను తెలిపే వాటిని రేపటి తరానికి చేరకుండా చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనాన్ని ఆశిస్తున్నారని ఏచూరి ప్రశ్నించారు. అయితే సిలబస్ హేతుబద్థీకరణ దిశలోనే తీసివేత జరిగిందని, దీనికి వేరే అంశాలతో కూడికలు తగవని ఎన్‌సిఇఆర్‌టి పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News